Manthena Ajay Reddy Fifth Death Anniversary
* అజయ్ రెడ్డి ఆశయాలను కొనసాగిద్దాం
-సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ఇప్పగూడెం గ్రామ మాజీ సర్పంచ్, సీపీఎం నాయకులు మంతెన అజయ్ రెడ్డి ఆశయాలు కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇర్రి అహల్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెంలో మాజీ సర్పంచ్ మంతెన అజయ్ రెడ్డి 5వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు ఇర్రి అహల్య మాట్లాడుతూ మంతెన అజయ్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారం కోసం, గ్రామ అభివృద్ధి కోసం, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాలు, విలువలను నేటి తరం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ప్రజల పక్షాన పోరాటాలు చేయడంలో ఆయన చూపిన నిబద్ధత అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సమానత్వ సమాజ నిర్మాణం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం మరింత బలోపేతం కావాలని, పార్టీ కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు గట్ల మల్లారెడ్డి గ్రామ ఉప సర్పంచ్ లింగనబోయిన రాజు శాఖ కార్యదర్శులు ప్రజాసంఘాల నాయకులు పోలాసు కిష్టయ్య, సట్ల రాజు, యన్ రాంరెడ్డి, దైద కుమార్, పోలాసు పద్మాకర్, బొంకురి రామచంద్రం, తిరుపతి, కోలిపాక వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
