Gooniparthi Bancherayi Lands
* గూనిపర్తిలో బంచరాయ్ భూముల రీ-సర్వే
* పాల్గొన్న తహసీల్దార్ సురేష్ కుమార్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : కమలాపూర్ మండలం గూనిపర్తి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 339 లో ఉన్న బంచరాయ్ భూముల రీ-సర్వే (Gooniparthi Bancherayi Lands) కార్యక్రమాన్ని తహసీల్దార్ సురేష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా పరిశీలించారు.
ఈ భూముల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాల్లో పశుసంపద రక్షణ కోసం ఈ భూములు చాలా కీలకం కాబట్టి, ఇవి అన్యాక్రాంతం కాకుండా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా అధికారులు ఈ సర్వేను వేగవంతం చేశారు.
ఈ రీ-సర్వే కార్యక్రమంలో మండల సర్వేయర్ గోపికృష్ణ , స్థానిక సర్పంచ్ బుర్ర రాధిక, గ్రామ పాలనాధికారి రాధిక, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
