Minister Konda Surekha and MLA Kadiyam Srihari Dispute
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం ముదిరింది. దేవాదాయ శాఖ రివ్యూ అంశంపై సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన ఆమె, తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను కలిసి విన్నవించారు. ఈ వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని పీసీసీ చీఫ్ హామీ ఇచ్చారు.
