Rahul Gandhi Protest Kamalapur
ఆకేరు న్యూస్, కమలాపూర్
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర ముఖ్య నాయకులు, విద్యార్థుల పై లాఠీఛార్జ్ను,అరెస్టులను నిరసిస్తూ కమలాపూర్ మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ కూడలి వద్ద శుక్రవారం కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. AICC, TPCC, హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం దేశ ప్రజల గొంతు నొక్కడమేనని ఈ సందర్భంగా నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి నైతిక బాధ్యత వహించకపోవడం దేశ ప్రజలను, రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నుకున్న ప్రజలను తీవ్రంగా అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాట్ల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలసాని రమేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి విష్ణుదాస్ వంశీధర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
