Kamalapur Padmashali Society Meeting
ఆకేరు న్యూస్, కమలాపూర్:
కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్లో చేనేత సంఘాల అధ్యక్షులు, మహిళా సర్పంచులకు, ప్రజా ప్రతినిధులకు ఆదివారం ఘన సన్మానం చేశారు. పద్మశాలి పరపతి సంఘం 16వ వార్షిక సమావేశం సందర్భంగా కమలాపూర్, మర్రిపెల్లి గూడెం, గోపాలపూర్ చేనేత సహకార సంఘాల అధ్యక్షులను, కార్యవర్గాన్ని, అలాగే పద్మశాలీ మహిళా ప్రజాప్రతినిధులైన దేశరాజ్ పల్లి సర్పంచ్ మిట్టపల్లి మహేశ్వరి, గూనిపర్తి సర్పంచ్ బుర్ర రాధిక, కమలాపూర్ 7వ వార్డు సభ్యురాలు తుమ్మ స్వాతిని పరపతి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నాయకులు చేనేత కండువాలతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తు రాజకీయాల్లో పద్మశాలీలు మరింతగా రాణించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
ఇదే సమావేశంలో కమలాపూర్ పద్మశాలి పరపతి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పరపతి సంఘం నూతన అధ్యక్షునిగా బొప్ప శివశంకర్, ఉపాధ్యక్షునిగా మెండు రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి పద్మశాలి కులస్తులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవుటం ఝాన్సీ రాణి రవీందర్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం, రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యం రాజగోపాల్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పులికంటి రాజేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కేదాశి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు నల్ల సత్యనారాయణ, పరపతి సంఘం అధ్యక్షులు పోరండ్ల కుమారస్వామి, బైరి సహదేవ్, పరపతి సంఘం సభ్యులు, పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
