Bhupalpally Women Protest at Singareni GM office
* తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని సింగరేణి జీఎం ఆఫీస్ ముందు ధర్నా
ఆకేరు న్యూస్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి జీఎం కార్యాలయం వద్ద మహిళలు కాలి బిందెలతో సోమవారం భారీ ధర్నా నిర్వహించారు.
మున్సిపల్ పరిధిలోని 26, 7వ వార్డుల్లో గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని, క్రమబద్ధంగా నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.
