Mangapet Forest Wind Damage
Published:
Updated: 28 Jul 2026 • 09:26 PM
* ములుగు జిల్లా మంగపేట అడవులలో భారీ గాలి దుమారానికి నేల కూలిన భారీ వృక్షాలు.
ఆకేరు న్యూస్ ములుగు:
ములుగు జిల్లాలోని మంగపేట మండలం మంగపేట కోమటిపల్లి మార్గమధ్యలో మంగళవారం సాయంత్రం గాలి బీభత్సానికి భారీ వృక్షాలు నేలకూలాయి. సుమారు రెండు కిలోమీటర్ల పొడవు చెట్లు రోడ్డుపై విరిగి పడిపోయాయి. దీంతో కోమటిపల్లి కొత్తూరు గ్రామాలకు వెళ్ళు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అయితే గత రెండేళ్ల క్రితం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవులలో ఇలాంటి గాలి బీభత్సానికి వందలాది ఎకరాలలో చెట్లు నేలకూలాయి. అలాంటి సంఘటనే జరిగి ఉంటుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
