Collector Chahat Bajpai Government Land Protection Inspection
ఆకేరు న్యూస్ , హనుమకొండ :
ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా బుధవారం కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామ పరిధిలో గతంలో స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆమె స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ పర్యటనలో భాగంగా భూమికి సంబంధించిన రికార్డులు, మ్యాపులను తహసీల్దార్ రాజును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో కలిసి నేరుగా భూమి హద్దులను పరిశీలించి, రికార్డుల్లో ఉన్న వివరాలు గ్రౌండ్ రియాలిటీతో సరిపోతున్నాయా లేదా అని పరిశీలించారు. ప్రభుత్వ భూముల రక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ పరిశీలనలో సర్వేయర్ స్టాలిన్, ఆర్ఐ కృష్ణ, ఇతర రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
