Mahira Khan Pregnant
* రెండోసారి తల్లి కాబోతున్న పాకిస్థానీ నటి
* సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేసిన మహిరా
ఆకేరు న్యూస్, సినిమా: పాకిస్థానీ ప్రముఖ నటి మహిరా ఖాన్ రెండోసారి తల్లి కాబోతున్నారు. 41 ఏళ్ల మహిరా ఖాన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంటున్న సమయంలో బేబీ బంప్ కనిపిస్తున్న ఫొటోను ఆమె షేర్ చేశారు.
తెల్లటి గౌన్‌లో చిరునవ్వుతో కెమెరాకు పోజిచ్చిన మహిరా.. ఒక చేతిని బేబీ బంప్‌పై ఉంచారు. ‘‘మనం ప్రణాళికలు వేసుకుంటాం.. కానీ అల్లాహ్‌ది మరో ప్రణాళిక’’ అనే అర్థం వచ్చేలా ఆమె క్యాప్షన్ పెట్టారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
* టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో సత్కారం
ప్రస్తుతం టొరంటోలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్లో మహిరా ఖాన్ పాల్గొంటున్నారు. టీఐఎఫ్ఎఫ్ కమ్యూనిటీ ఇంపాక్ట్ ప్రోగ్రామింగ్‌లో భాగంగా నిర్వహించిన చర్చా కార్యక్రమానికి ఆమె మోడరేటర్‌గా వ్యవహరించారు. సినిమాకు అందించిన సేవలకు గుర్తింపుగా ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమెను సత్కరించారు. 2016లో షారుఖ్ ఖాన్ సరసన ‘రయీస్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మహిరా.. దాదాపు పదేళ్ల తర్వాత టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు.
* 2023లో రెండో వివాహం
మహిరా ఖాన్ 2023 అక్టోబర్‌లో వ్యాపారవేత్త సలీమ్ కరీమ్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇదే తొలి సంతానం. అయితే మహిరాకు ఇది రెండో సంతానం. మొదటి భర్త అలీ అస్కరీతో ఆమెకు ఇప్పటికే 17 ఏళ్ల కుమారుడు అజ్లాన్ ఉన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
