Apple Truck Accident Warangal
Published:
Updated: 30 Jul 2026 • 04:13 PM
ఆకేరు న్యూస్, వరంగల్: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం మాటేడు గ్రామం వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న ఒక డీసీఎం వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే స్థానికులు, దారిన పోయే ప్రయాణికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఆపిల్ పండ్ల కోసం ఎగబడ్డారు. క్షణాల్లోనే డీసీఎంలోని లోడ్ అంతా ఖాళీ అయిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

సీనియర్ కరస్పాండెంట్
జిల్లపెళ్లి దీపిక, MA ( Journalism )
గత ఐదు సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
