Polymer Currency Notes Trails in India
ఆకేరు న్యూస్, డెస్క్: భారతదేశంలో కరెన్సీ నోట్ల రూపంలో త్వరలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్లకు ప్రత్యామ్నాయంగా పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అయితే ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లను వెంటనే ఉపసంహరించుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది.
* పాలిమర్ నోట్లు అంటే ఏమిటి?
పాలిమర్ నోట్లు సాధారణ కాగితంతో కాకుండా బయాక్సియల్లీ ఓరియెంటెడ్ పాలీప్రొపీలీన్ (BOPP) అనే ప్రత్యేకమైన సింథటిక్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారు చేస్తారు. వీటిలో పారదర్శక సెక్యూరిటీ విండో, మైక్రో ప్రింటింగ్, అధునాతన భద్రతా ఫీచర్లు ఉండటంతో నకిలీ నోట్లు తయారు చేయడం చాలా కష్టమవుతుంది.
* ఎందుకు తీసుకొస్తున్నారు?
సాధారణ కాగితపు నోట్లు త్వరగా చిరిగిపోవడం, తడవడం, మురికిపడడం వంటి సమస్యలు ఉంటాయి. కానీ పాలిమర్ నోట్లు నీరు, తేమను తట్టుకుని ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. నిపుణుల అంచనాల ప్రకారం ఇవి కాగితపు నోట్లతో పోలిస్తే దాదాపు 2.5 రెట్లు ఎక్కువకాలం వినియోగంలో ఉంటాయి. దీంతో కొత్త నోట్లు ముద్రించే ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది.
* నకిలీ నోట్లకు చెక్
పాలిమర్ నోట్లలో పారదర్శక విండోలు, ప్రత్యేక సెక్యూరిటీ డిజైన్లు, మైక్రో ప్రింటింగ్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఉంటాయి. దీంతో నకిలీ కరెన్సీ తయారీని గణనీయంగా అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
* ఇది కొత్త ఆలోచన కాదు..
ప్రపంచంలో తొలిసారిగా ఆస్ట్రేలియా 1988లో పాలిమర్ కరెన్సీని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం కెనడా, యూకే, న్యూజిలాండ్, రొమేనియా, వియత్నాం వంటి పలు దేశాలు ఈ నోట్లను విజయవంతంగా వినియోగిస్తున్నాయి. భారత్‌లో కూడా 2012లో రూ.10 పాలిమర్ నోట్లపై ట్రయల్ నిర్వహించగా.. ఇప్పుడు మరోసారి రూ.10, రూ.20 నోట్ల ఫీల్డ్ ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
