Asmita Dey Wins India’s First-Ever Commonwealth Judo Gold
ఆకేరు న్యూస్, డెస్క్:
కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో భారత జూడోకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న స్వర్ణ క్షణం ఎట్టకేలకు వచ్చింది. మహిళల 48 కేజీల విభాగంలో భారత జూడోకా అస్మిత దే అద్భుత పోరాటంతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని భారత జూడో చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. అదే రోజు పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్ కూడా గోల్డ్ గెలవగా, యామిని మౌర్య రజత పతకం సాధించి భారత జూడో జట్టు ఘన ప్రదర్శన చేసింది.
* గోల్డెన్ స్కోర్‌లో అస్మిత అద్భుత విజయం
స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరిగిన మహిళల 48 కేజీల ఫైనల్లో అస్మిత దేకు కెనడాకు చెందిన హైది క్వాష్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. నిర్ణీత సమయంలో ఇరువురు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ గోల్డెన్ స్కోర్ దశకు వెళ్లింది. తీవ్ర ఒత్తిడిలోనూ అస్మిత అసాధారణ ప్రతిభ కనబరిచి నిర్ణయాత్మక యూకో పాయింట్ సాధించి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
* భారత్ జూడోకు చారిత్రాత్మక రోజు
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకు జూడోలో ఒక్క స్వర్ణ పతకం కూడా గెలవలేదు. ఆ నిరీక్షణకు అస్మిత ముగింపు పలకగా, కొద్ది సేపటికే పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్ ఆస్ట్రేలియాకు చెందిన జోషువా కాట్జ్పై సంచలన విజయం సాధించి మరో గోల్డ్ అందించాడు. మహిళల 57 కేజీల విభాగంలో యామిని మౌర్య ఫైనల్ వరకు చేరి రజత పతకం గెలుచుకుంది.
* సవాళ్లను జయించి చరిత్ర సృష్టించిన భారత జూడో జట్టు
టోర్నీకి ముందు డోపింగ్ వివాదం, గ్లాస్గో చేరుకున్న తర్వాత శిక్షణ సామగ్రి ఉన్న లగేజ్ ఆలస్యంగా చేరడం వంటి ఇబ్బందులు ఎదురైనా భారత జూడో జట్టు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమించి రెండు స్వర్ణాలు, ఒక రజతంతో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
