Retired Army Jawan Felicitation
ఆకేరు న్యూస్, కమలాపూర్:
ఆర్మీలో సుదీర్ఘ కాలం సేవలు అందించి రిటైర్ అయిన సైనికుడికి ఉప్పల్ గ్రామ యువత ఘన స్వాగతం ఇచ్చి, ఘనంగా సన్మానించింది.

వివరాల్లోకి వెళితే.. హుజురాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన మొలుగు గోపి సైన్యంలో టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో 15 ఏండ్లు గా అస్సాం, చండీగఢ్ పలు రాష్ట్రాల్లో సేవలు అందించి హవాల్దార్‌గా రిటైర్ అయ్యారు. ఆర్మీ సర్వీసు ముగించుకుని ఆదివారం ఉప్పల్ రైల్వే స్టేషన్లో దిగి ఆయన స్వగ్రామమైన కనుకుల గిద్దకు వెళ్తుండగా స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులతో పాటు స్థానిక గ్రామ యువకులు భారీ ఎత్తున ఉప్పల్ రైల్వే స్టేషన్‌కు తరలివచ్చారు. దేశ సేవ చేసి తిరిగి వచ్చిన సైనికుడిని తమ ఊరి గడ్డపైకి సాదరంగా ఆహ్వానించి, సన్మానించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని యువకులు చాటారు. ఇందులో భాగంగా ఉప్పల్ గ్రామపంచాయతీ భవనం ఎదుట మొండెద్దుల నాగరాజు ఆధ్వర్యంలో యువకులు మాజీ జవాన్ ను శాలువాతో సన్మానించి దేశభక్తిని చాటారు. అనంతరం రైల్వే స్టేషన్ నుండి ఉప్పల్ గ్రామ పొలిమేరల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి మాజీ జవాన్‌ను ఘనంగా సాగనంపారు.యువత చూపిన దేశభక్తి ఇతరులలో స్ఫూర్తిని నింపింది. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
