Rayaparthy Gurukul Health Camp
ఆకేరు న్యూస్,రాయపర్తి:
రాయపర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో బుధవారం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గారే సహేంద్ర భిక్షపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పాఠశాలకు విచ్చేసిన సర్పంచ్ మొదటగా విద్యార్థులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించారు. అనంతరం కళాశాలలోని తరగతి గదులను, విద్యార్థుల వసతి గదులను మరియు పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణాన్ని మరియు గదులను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గారే సహేంద్ర భిక్షపతి మాట్లాడుతూ… వర్షాకాలం/సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున విద్యార్థులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. కలుషిత నీరు, ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ఉపాధ్యాయుల లేదా వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్,సరిత ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
