MLA Yashaswini Reddy Valmidi Temple EO Meeting
ఆకేరు న్యూస్,పాలకుర్తి: మండలంలోని శ్రీ వాల్మీడీ సీతారామచంద్రస్వామి దేవాలయ నూతన కార్యనిర్వాహణ అధికారి (ఈవో)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వెంకట్ రెడ్డి బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈ వో వెంకట్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం తరఫున ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
అనంతరం వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆలయ అభివృద్ధి కోసం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తుల సహకారంతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తానని తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
