Gajavelli Bhujangam Death
* పంథిని లో తుదిశ్వాస
* ఏకధాటిగా 40 ఏళ్లు కుల సర్పంచ్ గా బాధ్యతలు
ఆకేరు న్యూస్ , వరంగల్ :
అయినవోలు మండలం లోని పంతిని గ్రామానికి చెందిన ప్రముఖ చిందు కళా కారుడు గజవెల్లి భుజంగం ( 70 ) అనారోగ్యం మృతి చెందారు.
ఈయన మృతి తెలంగాణ కళాకారుల కుటుంబాలకు మరియు యక్ష గాన నాటక ప్రియులకు యావత్ తెలంగాణ చిందు కుల సంఘానికి తీరని లోటని వారి కుమార్ లు చిందు కళా కారులైన గజవెల్లి శ్రీశైలం, అమరేందర్, రమేష్ శోక తప్త హృదయంతో తెలిపారు. గజవెల్లి భుజంగం తెలంగాణ రాష్ట్ర చిందు యక్ష గాన కుల సంఘానికి సర్పంచ్ గా గత ముప్పై సంవత్సరాలనుండి ఏక ధాటిగా ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నారని వారు తెలిపారు.వారసత్వ కళా కారులైన తన తాత తండ్రుల నుంచి వచ్చిన యక్ష గాన కళను అంది పుచ్చుకొని అనేక పాత్ర లను వేసి ప్రేక్షకులను అలరించే వారని, రామాయణం, మహా భారతము, భాగవతం ఇంకా అనేక పౌరాణిక చిందు యక్ష గాన నాటకాలలో భీముడు, అర్జునుడు, నారదుడు, మహర్షి, శ్రీకృష్ణుడు, ధర్మరాజు లాంటి మేటి పాత్ర లో వేషం వేసి ఆ పాత్ర లో జీవించి, నటించే వారని,ప్రేక్షకులను తన నటన మరియు గానం చేత తన్మయత్వం చెందించేవారని తెలిపారు.గత యాభై సంవత్సరాలనుండి తన కుల వృత్తి ని నమ్ముకొని జీవనధారం గావించే వారని నిరుపేద కళా కారుడైన గజవెల్లి భుజంగం మృతి తమకు తీరని లోటని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమార్తెలు, అల్లుండ్లు వసుమతి కేదారి, జమున చిరంజీవి, సినీ టీవీ కళా కారుడు జబర్దస్త్ ఫేం రాజ మౌళితో పాటు వేదాంతం, సిద్దూ, భాస్కర్, వెంకన్న, రవి, కుమార్, స్వామి, రక్త సంబంధి కులు,చిందు కుల సంఘస్తులు, బంధువులు, మిత్రులు,గ్రామస్తులు, తదితరులు అంతిమ యాత్ర లో పాల్గొని నివాళి అర్పించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
