Hyderabad Promotes Eco-Friendly Clay Ganesha Idols
* ఈ సంవత్సరం కొత్త నినాదం
* నగరంలో మట్టి గణపతుల తయారీకి ప్రోత్సాహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వినాయక చవితి వస్తోందంటే మహానగరం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ధూల్‌పేట్, కూకట్పల్లి, ఎల్బీనగర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లోని రాజస్థానీ కళాకారులు 3 నెలల ముందు నుంచే విగ్రహాల తయారీలో నిమగ్నం అవుతూ ఉంటారు. అయితే ఈసారి మట్టిగణపతుల విగ్రహాల సంఖ్యను పెంచేందుకు అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్-3150 పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాయి. మట్టి గణపతుల తయారీని ప్రారంభించాయి.
* సెప్టెంబరు 14న వినాయక చవితి
వినాయక చవితి సమీపిస్తుండడంతో నగరంలో వినాయక విగ్రహాల తయారీ ఊపందుకున్నాయి. రాజస్థానీ కళాకారులు, కుమ్మరి కుటుంబాలు గణపతుల తయారీలో నిమగ్నమయ్యాయి. రాజస్థానీ కళాకారులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో మట్టిగణపతులను తయారు చేసేలా పోలీసు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ వంటి సంస్థలు ముందడుగు వేశాయి. ఈ ఏడాది సెప్టెంబరు 14న వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నాయి. కూకట్పల్లి వసంతనగర్ కేంద్రంగా.. మట్టి వినాయక ప్రతిమల తయారీకి అడుగులు పడ్డాయి.
* ఆరు అంగుళాల నుంచి ఆరు అడుగుల వరకు..
మట్టి విగ్రహాలను ఆరు అంగుళాల నుంచి ఆరు అడుగుల వరకు తయారు చేసేలా కుమ్మరి కుటుంబాలు సిద్ధమయ్యాయి. ముందస్తు బుకింగ్స్‌ను బట్టి వివిధ ఆకారాల్లో నేచురల్ కలర్స్ అంటే మట్టితో తయారు చేసిన కాటుక, సింధూరం వంటి వాటితో అలంకరిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు. కుమ్మరి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ నగర భక్తులకు తక్కువ ధరకే వినాయక విగ్రహాలను తయారు చేసి ఇస్తున్నారు. రంగు రంగుల విగ్రహాలవైపు వెళ్తున్న యువతకు అవగాహన కల్పిస్తామని రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ ప్రకటించింది. మట్టి వినాయక విగ్రహాలకు పూజలు చేయాలని సూచిస్తోంది. అపార్ట్మెంట్స్, కాలనీల్లో విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాత ఆ మట్టిని ఇళ్లలో పెరట్లో మొక్కలకు వేస్తే మంచిదంటున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
