Sreeleela Joins Rajinikanth's 'Dharman' in a Key Role
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
నటి శ్రీలీల జోష్ మీదుంది. వరుస ఆఫర్లతో బిజిబిజీగా గడుపుతున్నది. క్షణం తీరిక ఉండదు గానీ లక్కే కలిసి రావడం లేదు. బడా హీరోలతో ఫ్రేం పంచుకుంటుంది కానీ సినిమాలు హిట్టుకు బదులు ఫట్ అవుతున్నాయి? . దీంతో డీలా పడుతున్నట్లు కనిపిస్తున్న క్రమంలో ఏదొక చాన్స్ పట్టేస్తుంది.
* సూపర్ స్టార్ సినిమాలో చాన్స్
తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ధర్మాన్. ఇందులో ఒక పవర్ఫుల్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. జూన్ 2026లో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, మేకింగ్ వీడియోలకు ప్రేక్షకులలో భారీ స్పందన లభించింది. ఈ సినిమాలో శ్రీలీల భాగస్వామ్యం అయినట్లు మేకర్స్ కాన్ఫాం చేశారు. ఒక కీలక పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది.
* లెనిన్ .. దెబ్బసిందిగా..
ఇటీవల లెనిన్ సినిమాలో నటించే చాన్స్ వదులుకుంది ఈ బ్యూటీ . ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ తో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. అంతకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన వస్తాద్ భగత్ సింగ్, తర్వాత శివకార్తీకేయన్ తో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకున్న పరాశక్తి ప్రేక్షకుల ఆదరణకు నోచలేదు.
* కమల్ హసన్ మూవీ ఇది
కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీ మంచి మిత్రులు. ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు. రజినీకాంత్ 173వ ప్రాజెక్టు బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. కమల్ ..‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ సంస్థ ఈ భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తున్నది.
* ప్రధాన తారాగణం
రజనీకాంత్‌తో పాటు ఈ చిత్రంలో సీనియర్ నటి సిమ్రాన్, రాశీ ఖన్నా , ప్రముఖ హాస్యనటుడు యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
