MLA Yashaswini Reddy DCC Meeting
* జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న యశస్విని రెడ్డి
ఆకేరు న్యూస్,జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్ష సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,కి జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధనవంతి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేయడం తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించి చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ
పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రంథలయా చైర్మన్ రాంబాబు గారు, కాంగ్రెస్ నాయకులు, మండలాల అధ్యక్షులు,ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
