Nayanthara Toxic Movie
* నయన్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాక్సిక్ టైలర్ ఇటీవల లాంచ్ అయ్యింది. ఈ మూవీలో హీరోగాయాష్, హీరోయిన్ గా కియరా అద్వాని, రుక్మిడి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియాతో పాటు నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయన్ ఒక గంగ అనే గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపిస్తారు.ఈ సినిమాకు గీతూ మోహన్ దాసు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
* ఆ క్షణం నుంచి ఆలోచన మారింది..
టాక్సిక్ ప్రాజెక్టు లో తాను ఎలా ఎంటర్ అయ్యారో నయన్ చెప్పారు. ‘‘గీతూ ఈ ప్రాజెక్టు కోసం నాకు కాల్ చేశారు.. అప్పటికే నాకు ఆసక్తి లేదు. భారీ తారాగణం ఉండటంతో సినిమా చేసేందుకు ఎవరైనా భయపడతారు.. నేను కూడా అంతే..ఈ సినిమా నేను చేయలేను అని చెప్పాను. పట్టువిడవ కుండా డైరెక్టర్ ఎందుకు చేయవు.. నీ ప్రబ్లం ఏంటి? అంటూ వెంట పడ్డారు. సవాలక్ష ప్రశ్నలు వేశారు. చివరికి అంగీకరించా.. గీతూ వచ్చి స్టోరీ చెప్పారు. స్టోరీ విన్నాక నా ఆలోచన విధానం మారిపోయింది‘‘ అని నయన్ అన్నారు.
* యాష్ కాల్ చేశారు.. వచ్చానంతే
‘‘సాధారణంగా సినిమా ప్రమోషన్స్ కు,ఈవెంట్లకు రాను. ఆ ఫంక్షన్లలో నాకు మాట్లాడటం రాదు. కానీ యాష్ కాల్ చేసి ఆహ్వానించే సరికి హాజరయ్యాను. టాక్సిక్ కోసం యాష్ నాలుగున్నరేళ్లు సమయం కేటాయించారు. మంచి డెడికేషన్ ఉన్న వ్యక్తి. కుటుంబంతో గడిపే గోల్డెన్ టైంను టాక్సిక్‌కు కేటాయించారన్నారు. ఇక కియారా గురించి చెప్పాలంటే టాక్సిక్ కి ముందు ఆ తర్వాత అని మాట్లాడుకుంటారు’’ అని అన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
