Elkathurthy Ministers Visit
* అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఆకేరు న్యూస్, హుస్నాబాద్:
హుస్నాబాద్ నియోజకవర్గంలో రేపు (ఆగస్టు 10) భారీ అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. మండల పరిధిలోని ఎల్కతుర్తి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న తహసిల్దార్ కార్యాలయ భవన శంకుస్థాపనతో పాటు, నూతనంగా ఏర్పాటు చేసిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.
ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా హాజరుకానున్నారు. ఉదయం 10:00 గంటలకు ప్రారంభమయ్యే ఈ పర్యటనలో మంత్రులు స్వయంగా పాల్గొని పలు సంక్షేమ, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
పాలనా సౌలభ్యం పెంచడం మరియు రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత వేగవంతంగా, సులభంగా అందించే లక్ష్యంతో అన్ని రకాల అధునాతన వసతులతో నూతన తహసిల్దార్ కార్యాలయ భవనాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం మంత్రులు భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత, గ్రామీణ ప్రాంత పేద బాలికల విద్యకు మహర్దశ కల్పిస్తూ, వారికి ఉచిత నాణ్యమైన విద్యతో పాటు వసతి సౌకర్యాలను అందించే కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం నూతన భవనాన్ని వారు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఎల్కతుర్తి మండలంలో చేపడుతున్న ఈ ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించి జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసే ఈ శుభసందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు ఎల్కతుర్తి మండల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని హుస్నాబాద్ మంత్రి క్యాంపు కార్యాలయం ప్రకటన ద్వారా కోరింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
