Medico Student Priyanka Death
* విషాదాంతంగా మెడికో మృతి
* గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి
* గద్వాల్ జిల్లాలోని స్వగ్రామానికి భౌతికకాయం తరలింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆ తండ్రికి ఇక శోకమే మిగిలింది. కలల సౌధం కూలిపోయింది. గారాల పట్టి తిరిగిరాని లోకాలకు మరలిపోయింది. వైద్య విద్య పూర్తి చేసి ఎంతో మందికి ప్రాణం పోస్తుందనుకున్న బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తనకేం పాపం తెలియకపోయినా మద్యం మత్తులో ఉన్న దుర్మార్గుల పైత్యానికి మెడికో విద్యార్థి ప్రియాంక బలైపోయింది.
* స్వగ్రామానికి భౌతికకాయం
రాజమహేంద్రవరంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిన్న ధ్రవీకరించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కిమ్స్ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈరోజు ఉదయం పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి అయింది. దీంతో ఆమె మృతదేహాన్ని స్వగ్రామం గద్వాల్ జిల్లా ఐజా మండలం ఎక్లాస్పూర్ తరలించారు. అక్కడ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
* ఆస్పత్రికి మంత్రి అడ్లూరి
తెలంగాణ తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గాంధీ ఆస్పత్రికి చేరుకుని ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించారు. జరిగిన ఘటన తీవ్ర బాధాకరమని వారిని ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. పోస్టుమార్టం జరుగుతున్న తీరుపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రాజమహేంద్ర వరం ఎమ్మెల్యే శ్రీనివాస్ కూడా ప్రియాంక తండ్రితో మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. అలాగే ఏపీ మంత్రి టీజీ భరత్ కూడా ప్రియాంక స్వగ్రామానికి వెళ్లనున్నారు. మెడికో కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల చెక్కును అందజేయనున్నారు.
* ఉరిశిక్ష వేయాలి..
రాజమహేంద్రవరంలో తమ కుమార్తె కారుతో ఢీకొట్టి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రియాంక తండ్రి వెంకటేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉరిశిక్ష వేసినా తక్కువే అన్నారు. ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గవద్దని అన్నారు. ఇప్పటికే బాధలో ఉన్న తమను ఇంకా బాధపెట్టేలా కొన్ని చానళ్లు, పత్రికల్లో వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
