MLA Kaushik Reddy Uppal Challur New Mandals
* లబ్ధిదారులకు పూర్తి వసతులతో 2BHK ఇళ్లను అందుబాటులోకి తీసుకురావాలి
* కమలాపూర్ బస్టాండ్‌ను ప్రారంభించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి
– ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హుజురాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్, చల్లూరు గ్రామాలను నూతన మండలాలుగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమవారం కమలాపూర్ మండలంలో ఇందిరమ్మ ఇల్లు 2BHK పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పలు విజ్ఞప్తులు చేశారు.
* కేసీఆర్ కృషికి శిరస్సు వంచి పాదాభివందనం
గతంలో కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పేదలకు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన కృషికి తాను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.
*పూర్తి వసతులతో 2BHK ఇళ్లను అందించాలి*
పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస వస్తువులను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఒక్కో ఇంటికి సుమారు రూ. 20 వేల నుండి రూ. 25 వేల వరకు ఖర్చవుతుందని, ఆ ఖర్చును కూడా ప్రభుత్వమే భరించి లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ఇళ్లను అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు.
* ఉప్పల్, చల్లూరు ను మండలాలుగా ఏర్పాటు చేయాలి
హుజురాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్ గ్రామానికి అన్ని అర్హతలు ఉన్నాయని, సుమారు 7,000 ఓట్లతో ఉప్పల్ చాలా పెద్ద గ్రామంగా విరాజిల్లుతోందని ఎమ్మెల్యే అన్నారు. ఉప్పల్‌ను నూతన మండలంగా ప్రకటించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని ఆయన కోరారు. అలాగే, వీణవంక మండలంలోని చల్లూరును కూడా మండలంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
* కమలాపూర్ బస్టాండ్ ప్రారంభోత్సవం
కమలాపూర్ లో రూ. 1.75 కోట్లతో నిర్మించిన బస్టాండ్ నిర్మాణం పూర్తయిందని, దాన్ని తక్షణమే పూర్తిస్థాయిలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆయన కోరారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
