Senior Maoist Leader Kakara Madhavi Surrenders Before DGP CV Anand
* 40 ఏళ్ళుగా అజ్క్షాత జీవితం
* సీనీ నటుడు కాకరాల కుమార్తె
* ముగ్గురు కుమార్తెలు మావోయిస్ట్ పార్టీలోనే..
* మరో ముగ్గురు మావోయిస్ట్‌లు మాత్రమే మిగిలారు
– డీజీపీ సీవీ ఆనంద్
ఆకేరు న్యూస్, ములుగు: సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు కాకరాల అలియాస్ సమత అలియాస్ మాధవి అలియాస్ దుర్గ సోమవారం డీజీపీ సీవీ ఆనంద్ ఎదుట లొంగిపోయారు. సుమారు 40 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె, కేంద్ర కమిటీ సభ్యుడు పటేల్ సుధాకర్‌రెడ్డి సహచరిగా చెబుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సమత భర్త పటేల్ సుధాకర్ రెడ్డి 2010లో ములుగు జిల్లా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందగా, ఆమె సోదరి కాకరాల సునీత గత ఏడాది పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంత డాక్యుమెంట్ల తయారీ, అనువాదం మరియు మహిళా సమస్యలపై రచనలు చేయడంలో సమత కీలక పాత్ర పోషించినట్లుగా చెబుతున్నారు . కాగా సమత సీనియర్ సినీ నటుడు కాకరాల కాకరాల వీర వెంకట సత్యనారాయణ కుమార్తె.ఈయన ఇద్దరు కూతుర్లు కూడా మావోయిస్ట్ పార్టీ లోనే సుదీర్ఘ కాలం పనిచేశారు.
* మరో ముగ్గురు మాత్రమే మిగిలారు..
తెలంగాణకు చెందిన మరో ముగ్గురు మావోయిస్టులు మాత్రమే మిగిలారని, వారు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ ఆనంద్ పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం, ఉపాధి, శిక్షణ, మరియు వైద్య సహాయం అందించడంతో పాటు, మాజీ మావోయిస్టుల కోసం ఉచిత వైద్య సేవల ఆరోగ్య కార్డులను పోలీసులు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో పునరావాస ప్యాకేజీ కింద సమతకు డీజీపీ చెక్కును అందజేయగా, మొత్తం 23 మంది లొంగిపోయిన మావోయిస్టులకు సుమారు రూ.1.88 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. మరోవైపు అడవుల్లో అభివృద్ధి, విద్య, వైద్యం, రోడ్లు, విద్యుత్, తాగునీరు, సెల్‌ఫోన్ కనెక్టివిటీ వంటి చర్యలతో పాటు అభివృద్ధి, పునరావాసం, పోలీస్ చర్యలతో కూడిన బహుముఖ వ్యూహంతో మావోయిజాన్ని అరికడుతున్నామని ఆనంద్ చెప్పారు. .
———————————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
