7.4-Magnitude Earthquake Strikes Colombia
* 7.4 తీవ్రతతో ప్రకంపనలు
ఆకేరు న్యూస్, డెస్క్: దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ కొలంబియాలోని చోకో ప్రావిన్స్‌లో భూకంప ప్రభావం తీవ్రంగా కనిపించింది. పలు భవనాలు దెబ్బతినగా, కొన్ని కూలిపోయాయి.
* చోకోలో భారీ నష్టం
శాన్ జోస్ డెల్ పాల్మార్ సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. క్విబ్డో, కాలీ, పెరీరా తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు తీవ్రంగా నమోదయ్యాయి. కాలీలో 20 భవనాలు కూలిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
* పొరుగు దేశాల్లోనూ ప్రకంపనలు
భూకంప ప్రభావంతో కొలంబియా పొరుగు దేశాలైన ఈక్వెడార్, వెనిజులాలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. బొగోటాలో కూడా భూమి కంపించినప్పటికీ పెద్ద నష్టం జరగలేదని సమాచారం.
పెరీరా, మణిజాలెస్, క్విబ్డో, అర్మేనియా, కార్టాగో, బ్యూనావెంచురా ప్రాంతాల్లోని విమానాశ్రయాలు దెబ్బతినడంతో కొన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు కొలంబియా విమానయాన సంస్థ ప్రకటించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
