Train Theft Cases Arrest
* 22 కేసులు వెలుగులోకి!
* రైళ్లలో వరుస చోరీలు
* నిందితుడి అరెస్ట్
* రూ.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
రైల్వే ట్రాక్ పక్కన తిరుగుతూ ఉన్నాడు. అతడి కదలికలపై అనుమానంతో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు పెద్ద దొంగ అని గుర్తించారు. ఏకంగా 22 కేసుల్లో నిందితుడు. సికింద్రాబాద్, ఖమ్మం రైల్వేస్టేషన్లలో వరుస చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. రూ.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
* రైల్వే డీఎస్పీ జావిద్ కథనం ప్రకారం..
రైళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. రైల్వే డీఎస్పీ జావిద్ కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడి నుంచి నగలు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన ఇందిరాల రాజేష్ (36), క్యాబ్ డ్రైవర్ పనిచేసేవాడు. ఆ సమయంలో వ్యసనాల బారిన పడ్డాడు. జల్సాలకు అలవాటు పడ్డాడు. వచ్చే ఆదాయం వాటికి సరిపోక పోవడంతో డబ్బు కోసం అక్రమ మార్గాలను వెదకడం ప్రారంభించాడు.
* 2009 నుంచీ చోరీల బాట
అద్దె కారు నడపడం ద్వారా వస్తున్న ఆదాయం అతడి జల్సాలకు సరిపోయేది కాదు. విలాస జీవితం కోసం చోరీలు చేయాలని నిర్ణయించాడు. 2009 నుంచీ చోరీల బాట పట్టాడు. ఈక్రమంలో ఇప్పటి వరకు అతడిపై ఏకంగా 22 కేసులు నమోదు అయ్యాయి. వివిద పోలీస్ స్టేషన్లో పలుమార్లు జైలుకు కూడా వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చాడు. అయినా నేరాల బాట వీడలేదు. ఈక్రమంలో మరోసారి పోలీసులకు చిక్కాడు.
* చిక్కింది ఇలా..మంగళవారం ఉదయం
పలు కేసుల్లో నిందితుల కోసం సికింద్రాబాద్ ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు నిఘా పెట్టారు. ఈక్రమంలో సాయిబాబా ఆలయం రైల్వే ట్రాక్ పక్కన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని గమనించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమైదన శైలిలో విచారణ చేపట్టగా సికింద్రాబాద్, ఖమ్మం రైల్వే స్టేషన్ పరిధిలోవు నేరాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల నుంచి కాజేసిన సుమారు రూ.6 లక్షలు విలువైన 41 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిని రిమాండ్‌కు తరలించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
