పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు బోజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
* ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించిన భట్టి
* ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
ఆకేరు న్యూస్, ఖమ్మం : సెల్ఫీవీడియో తీసుకుంటూ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఈరోజు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం కుటుంబానికి అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో భట్టి మాట్లాడుతూ రైతు ఆత్మహత్యకు పురిగొల్పినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడవద్దని రైతులకు సూచించారు. రైతుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా, దివ్యాంగుడైన ప్రభాకర్ తండ్రి వీరభద్రయ్య ప్రభాకర్ పిల్లలకు న్యాయం చేయాలని ఇటీవల విచారణకు వచ్చిన చింతకాని తహసీల్దార్ కాళ్లపై పడి వేడుకున్న ఘటన అందరినీ కలిచివేసింది. ప్రభాకర్ కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వడంతోపాటు ప్రభాకర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే రోజు ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించడం గమనార్హం.
———————————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
