M M Keeravani updates on Varanasi music
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచగా.. తాజాగా కీరవాణి మ్యూజిక్ గురించి చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.
* ఆరా.. లేదా ఎనిమిదా?
‘వారణాసి’ ఆల్బమ్ చాలా గ్రాండ్‌గా ఉండబోతోందని కీరవాణి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘సంచారి, రణ కుంభ’ గీతాలు విడుదలై శ్రోతలను ఉర్రూతలూగించాయి. దీంతో సినిమాలో మొత్తం ఎన్ని పాటలు ఉండబోతున్నాయనే ఆసక్తి మొదలైంది. ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి కాబట్టి మొత్తం ఆరు పాటలు అనుకుంటే ఇంకా నాలుగు మాత్రమే రావాల్సి ఉంటుంది. అయితే మరికొందరు మాత్రం మరో ఆరు పాటలు ఉంటాయా? అంటూ చర్చించుకుంటున్నారు.
* సంగీతంలో కొత్త అనుభూతి
రాజమౌళి సినిమాలకు కీరవాణి అందించిన సంగీతం గతంలో ఎన్నోసార్లు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ‘వారణాసి’ కోసం కూడా ఆయన సరికొత్త సౌండ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా కథలోని భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు, పాత్రల ప్రయాణాన్ని సంగీతం మరింత బలంగా ఎలివేట్ చేసేలా ఆల్బమ్‌ను సిద్ధం చేస్తున్నారని సమాచారం.
* రాజమౌళి–కీరవాణి కాంబోపై భారీ అంచనాలు
రాజమౌళి–కీరవాణి కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాల్లో పాటలు, నేపథ్య సంగీతం కథలో కీలక భాగంగా నిలిచాయి. ఇప్పుడు ‘వారణాసి’ కోసం కీరవాణి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేలా తెరకెక్కిస్తున్నారు. దీంతో సినిమా సంగీతంపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
