Tibet Earthquake 49 Indians Missing
* వరదల వేళ భారీ భూకంపం
* 49 మంది భారతీయులు గల్లంతు..
* శరవేగంగా సహాయక చర్యలు
ఆకేరు న్యూస్, డెస్క్: నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఇటీవలే సంభవించిన ఆకస్మిక వరదల బీభత్సం నుంచి తేరుకోకముందే, తాజాగా టిబెట్‌ను భారీ భూకంపం వణికించింది.
* రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రత..
భూమి అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
* పెరిగిన మృతుల సంఖ్య…
ఆకస్మిక వరదలు మరియు భూకంప విపత్తుల కారణంగా నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో మృతుల సంఖ్య ఏకంగా 1,273కి చేరింది. మరోవైపు ఇరు దేశాల్లో కలిపి సుమారు 4,700 మందికి పైగా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
* గల్లంతైన వారిలో 49 మంది భారతీయులు…
టిబెట్‌లో సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో గల్లంతైన వారిలో 49 మంది భారతీయులు, 104 మంది నేపాల్ పౌరులు ఉన్నట్లు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఘటన స్థలంలో సహాయక బృందాలు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. పూర్తిస్థాయి ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
