Lingala Kedari Pushpalatha
* కేదారి వెనుకే భార్య పుష్పలత మృతి
* ఎంజీఎంలో చికిత్స పొందుతూ కన్నుమూత
ఆకేరు న్యూస్, వరంగల్: హనుమకొండ అదాలత్ కూడలిలోని ప్రసిద్ధ ‘లింగాల కేదారి హోటల్’లో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హోటల్ యజమాని లింగాల కేదారి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ప్రమాదంలో తీవ్ర కాలిన గాయాలకు గురై ఎంజీఎం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఆయన భార్య పుష్పలత (52) కూడా శుక్రవారం కన్నుమూశారు.
అదాలత్ జంక్షన్లో బుధవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో కేదారి దంపతులు ఇద్దరూ మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు, పోలీసులు వారిని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యలోనే కేదారి ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పుష్పలతకు వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆమె కొద్ది నిమిషాల క్రితమే తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఉచితంగా భోజనాలు అందించి, రూ. 10లకే కడుపు నింపి ‘ఆకలి తీర్చే దాత’గా పేరొందిన కేదారి దంపతులు ఇద్దరూ ఒక్కరి వెనుక ఒకరు అగ్నిప్రమాదంలో కన్నుమూయడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
