Parkal Gold Theft
* వెనుక కిటికీ తెరిచి.. ఇంట్లోకి ప్రవేశం
* 10 తులాల బంగారం.. 5 తులాల వెండి మాయం
ఆకేరు న్యూస్, పరకాల: పరకాల పట్టణంలోని మెయిన్‌రోడ్డులో పట్టపగలే ఇంట్లో చోరీ జరగడం కలకలం రేపింది. ఇంటి యజమానులు కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లిన సమయాన్ని గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సుమారు 10 తులాల బంగారం, 5 తులాల వెండి పట్టీలు అపహరించారు.
కిరాణా దుకాణం యజమాని ప్రకాశం కుటుంబ సభ్యులతో కలిసి మాసికానికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునే సరికి ఇంటి వెనుక కిటికీ తెరిచి కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాలో భద్రపరిచిన బంగారం, వెండి ఆభరణాలు కనిపించలేదు. వెంటనే పరకాల పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. దొంగలు ఇంట్లోకి ఎలా ప్రవేశించారు? ఎంతమంది వచ్చారు? అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
