Vijay Devarakonda- Rashmika Ranabali Teaser launch
* యాక్షన్‌తో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ
ఆకేరు న్యూస్, డెస్క్: విజయ్ దేవరకొండ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రణబాలి సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ ఆద్యంతం విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ సన్నివేశాలు, పౌరుషమైన డైలాగ్స్‌తో ఆకట్టుకుంది. బ్రిటీష్ పాలన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ‘రణబాలి’గా కనిపించనున్నారు.
బ్రిటీష్ అధికారులు ప్రజలను ఆకలి, కరువులోకి నెట్టే పరిస్థితులను టీజర్లో చూపించారు. పండిన ప్రతి ధాన్యపు గింజను దోచుకుంటున్న అధికారులను రణబాలి ఎదిరిస్తాడు. ప్రజల కోసం పోరాడే యోధుడిగా బ్రిటీష్ అధికారులు, పోలీసులను కత్తితో ఎదుర్కొంటూ విజయ్ కనిపించారు.
టీజర్లో శింగనమల బొబ్బిలి రణబాలిరా.. నీ యక్కా అంటూ విజయ్ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ‘ఒక్క మెతుకు కూడా పొలిమేర దాటదు అనే మరో డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది.
టీజర్ చివర్లో గుహ ముందు మట్టి కుండలోని ద్రావణాన్ని ఓ చేయి అందుకోవడం ఆసక్తిని పెంచుతోంది. ఆ ద్రావణం ఏంటి? దాని వెనుక కథేంటి? అనే ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 19వ శతాబ్దంలో 1854–1878 మధ్య బ్రిటీష్ పాలన కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా.. ఆర్నాల్డ్ వోస్లూ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ అక్టోబర్ 16న విజయదశమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
