Eye Bomma Movie
* వైవిధ్యమైన కథతో త్వరలో థియేటర్లలోకి
* 15 రోజుల్లోనే షూటింగ్ పూర్తి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ‘ఐ బొమ్మ’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బానోత్ పవన్, గౌతమ్, నర్మద, సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విజయ్ రఘునాథభట్ల దర్శకత్వం వహించారు. శ్రీ మల్లన్న క్రియేషన్స్ బ్యానర్‌పై కురువ జమన్న నిర్మించారు. సినిమా త్వరలో వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
* ట్రైలర్‌కు మంచి స్పందన
హైదరాబాద్‌లో ‘ఐ బొమ్మ’ ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రామసత్యనారాయణ ట్రైలర్ బాగుందని ప్రశంసించారు. చిన్న సినిమాల నిర్మాతలకు క్యూబ్, యూఎఫ్ఓ ఛార్జీలు భారంగా మారుతున్నాయని, నిర్మాతల మండలికి కొత్తగా ఎన్నికైన కార్యవర్గం తరఫున ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
* యువ దర్శకుడికి ప్రశంసలు
ప్రొడ్యూసర్ రాజా మాట్లాడుతూ దర్శకుడు విజయ్ రఘునాథభట్ల మంచి టాలెంట్ ఉన్న యువ దర్శకుడని ప్రశంసించారు. తాను ‘వర్జిన్ బాయ్స్’ సినిమా నిర్మించిన తర్వాత విజయ్ తనను కలిశారని, రెండు మూడు మంచి కథలను వినిపించారని తెలిపారు.
* 15 రోజుల్లో షూటింగ్ పూర్తి
నిర్మాత కురువ జమన్న మాట్లాడుతూ తమ వృత్తి వ్యవసాయమని, సినిమాలపై ఉన్న ఆసక్తితో చిత్ర నిర్మాణ రంగంలోకి వచ్చినట్లు చెప్పారు. దర్శకుడు విజయ్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే సినిమాను ప్రారంభించామని తెలిపారు. ఓవర్‌నైట్‌లో స్క్రిప్ట్‌ను పూర్తి చేసి కేవలం 15 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినట్లు వెల్లడించారు.
* టెక్నికల్ టీమ్
ఈ చిత్రానికి ఆనంద్ మరుకుర్తి డీవోపీగా, డా. శ్యామ్ కుమార్ ఎడిటర్‌గా, హనుమ ప్రసాద్ యాళ్ల సంగీత దర్శకుడిగా పనిచేశారు. స్క్రిప్ట్‌తో పాటు దర్శకత్వ బాధ్యతలను విజయ్ రఘునాథభట్ల నిర్వహించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
