BRS Mock Assembly at Telangana Bhavan
* తెలంగాణ భవన్లో నేడు మాక్ అసెంబ్లీ
* సీఎం పాత్రలో తలసాని
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ (BRS) నేడు మాక్ అసెంబ్లీ నిర్వహించనుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
* సస్పెన్షన్కు నిరసనగా..
శాసనసభ సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించకుండా తమ గొంతు నొక్కుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వెలుపల మాక్ అసెంబ్లీ నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని నిర్ణయించారు.
* స్పీకర్గా మాణిక్యరావు..
తెలంగాణ భవన్లో నిర్వహించనున్న మాక్ అసెంబ్లీలో మాణిక్యరావు స్పీకర్గా వ్యవహరించనున్నారు. సభా కార్యక్రమాలను అసెంబ్లీ తరహాలో నిర్వహిస్తూ వివిధ అంశాలపై చర్చించేలా కార్యక్రమాన్ని రూపొందించారు.
* సీఎం పాత్రలో తలసాని..
మాక్ అసెంబ్లీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్రను పోషించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ పాత్రల్లో పాల్గొని ప్రభుత్వ విధానాలు, అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.
*ప్రభుత్వంపై విమర్శలకు వేదికగా..
మాక్ అసెంబ్లీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీలో చర్చకు అవకాశం దక్కలేదని ఆరోపిస్తున్న అంశాలను ఈ వేదికపై ప్రస్తావించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వాగ్వాదం కొనసాగుతున్న వేళ.. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నిర్వహించనున్న మాక్ అసెంబ్లీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
