Avengers Endgame Re-Release
* సెప్టెంబర్ 25న థియేటర్లలో
ఆకేరు న్యూస్, సినిమా: మార్వెల్ అభిమానులకు గుడ్ న్యూస్. బ్లాక్‌బస్టర్ మూవీ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్కోర్’ పేరుతో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తోంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.
* ప్రీమియం ఫార్మాట్లలో ప్రదర్శన
ఈసారి ‘ఎండ్‌గేమ్’ను ఐమాక్స్, ఇన్ఫినిటీ విషన్, డాల్బీ వంటి ప్రీమియం ఫార్మాట్లలో వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. పెద్ద స్క్రీన్, మెరుగైన విజువల్స్, అద్భుతమైన సౌండ్‌తో అభిమానులకు మరింత గ్రాండ్ థియేట్రికల్ అనుభూతి అందనుంది.
* ‘డూమ్స్‌డే’ ఎక్స్‌క్లూజివ్ లుక్
రీ రిలీజ్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ కూడా ఉంది. రాబోయే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ లుక్‌ను ‘ఎండ్‌గేమ్ – ఎన్కోర్’ ప్రదర్శనలో చూపించనున్నారు. దీంతో మార్వెల్ అభిమానుల్లో ఈ రీ రిలీజ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
* థానోస్‌తో తుది పోరాటం
థానోస్ కారణంగా విశ్వంలోని సగం జనాభా నాశనం కావడంతో మిగిలిన సూపర్ హీరోలు విషాదంలో మునిగిపోతారు. తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడంతో పాటు విశ్వంలో శాంతి, సమతుల్యతను పునరుద్ధరించేందుకు థానోస్‌తో తుది పోరాటానికి సిద్ధమవుతారు. కెవిన్ ఫైజ్ నిర్మించిన ఈ చిత్రానికి ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహించారు. 2019లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
