Upendra Re Release
* పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలోకి
*బుక్ మై షో, డిస్ట్రిక్ట్‌లో బుకింగ్స్ ఓపెన్
ఆకేరు న్యూస్, సినిమా: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటించిన కల్ట్ మూవీ ‘ఉపేంద్ర’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో విభిన్నమైన కథనం, ప్రత్యేకమైన టేకింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉపేంద్ర దర్శకత్వ ప్రతిభకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పుడు కొత్త తరానికి కూడా ఈ కల్ట్ మూవీని పరిచయం చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఎంజీ మూవీస్ బ్యానర్‌పై ఎం. అచ్చిబాబు ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. రవీనా టాండన్, ప్రేమ, దామిని కీలక పాత్రల్లో నటించగా.. శిల్పా శ్రీనివాస్ నిర్మించారు. గురుకిరణ్ సంగీతం అందించారు. అప్పట్లో ఈ చిత్రంలోని పాటలు కూడా విశేష ఆదరణ పొందాయి. సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానున్న ‘ఉపేంద్ర’ కోసం బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్‌లో బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రీ రిలీజ్లో ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
