CM revanth reddy
Telangana Assembly: ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో 22(A) నిషేధిత భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. ఏళ్లుగా పేదలు, రైతులు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
త్వరలో సరళమైన మార్గదర్శకాలు
22(A) పరిధిలో ఉన్న భూముల కారణంగా రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు, కొనుగోళ్లు, బ్యాంకు రుణాల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీఎం తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే రెవెన్యూ మంత్రి, మంత్రివర్గ ఉపసంఘంతో సమీక్షలు నిర్వహించామని చెప్పారు. త్వరలో సరళమైన, చట్టబద్ధమైన మార్గదర్శకాలను రూపొందించి శాసనసభ ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు.
సభ్యుల సూచనలు పరిగణనలోకి
22(A) అంశంపై శాసనసభలో పలువురు సభ్యులు చేసిన సూచనలను ప్రభుత్వ రికార్డుల్లోకి తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. చట్టపరమైన పరిష్కారం రూపొందించే సమయంలో సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. గతంలో జరిగిన సాంకేతిక, పరిపాలనా సమస్యలు మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
