Jhiram Valley Naxal Attack
* ఝీరమ్ లోయ మావోయిస్టు దాడి కేసు
* 10 మందికి మరణ శిక్ష..
* 2013 నాటి కాంగ్రెస్ అటాక్‌లో 27 మంది బలి..
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశవ్యాప్తంగా రాజకీయంగా ప్రకంపనలు సృష్టించి, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని కుదిపేసిన ‘ఝీరమ్ లోయ మావోయిస్టు దాడి’ (Jhiram Valley Naxal Attack) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ భయానక మారణహోమంలో ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయిన 10 మంది దోషులకు జగదల్పూర్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మరణ శిక్ష (Death Sentence) విధిస్తూ తుది తీర్పునిచ్చింది. ఈ సంచలన తీర్పులో దోషులుగా తేలిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉండటం గమనార్హం.
* కోర్టు తీర్పు నేపథ్యం..
ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్లో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి అభయ్ సింగ్ రాజ్‌పుత్ ఈ కేసను విచారించారు. సమగ్ర విచారణ అనంతరం సెప్టెంబర్ 5వ తేదీనే నిందితులను దోషులుగా నిర్ధారించిన కోర్టు, నేరం యొక్క తీవ్రత, ఇరువర్గాల వాదనలను పరిగణలోకి తీసుకుని బుధవారం (సెప్టెంబర్ 16) శిక్షలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. (Jhiram Valley Naxal Attack) ఈ కేసుకు సంబంధించి చట్టపరంగా దోషులు హైకోర్టును ఆశ్రయించడానికి 30 రోజుల గడువును కోర్టు కల్పించింది. మావోయిస్టు ఏరివేత, ఉగ్రవాద సంబంధిత కేసులను విచారించే ఎన్ఐఏ కోర్టు ఇంత భారీ సంఖ్యలో దోషులకు మరణశిక్ష విధించడం ఇదే ప్రథమం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
* 2013 మే 25 నాటి ఘటన..
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా పరిధిలోని దర్భా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝీరమ్ లోయలో 2013 మే 25వ తేదీన ఈ దారుణం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సమీకరించేందుకు ‘పరివర్తన యాత్ర’ (Parivartan Rally) పేరుతో భారీ కాన్వాయ్ నిర్వహించారు.
మెరుపు దాడి : ఈ కాన్వాయ్ ఝీరమ్ లోయ ప్రాంతానికి చేరుకోగానే, మావోయిస్టులు ముందుగా పథకం ప్రకారం శక్తివంతమైన ఐఈడీ (IED) పేలుళ్లకు పాల్పడ్డారు.
విచక్షణారహిత కాల్పులు: పేలుళ్ల కారణంగా నిలిచిపోయిన కాన్వాయ్‌ను వందలాది మంది మావోయిస్టులు చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో పాటు గ్రెనేడ్లు విసిరారు.
*తుడిచిపెట్టుకుపోయిన నాయకత్వం..
ఈ అత్యంత క్రూరమైన దాడిలో అప్పట్లో ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నంద్‌కుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేశ్ పటేల్, కేంద్ర మాజీ మంత్రి విద్యాచరణ్ శుక్లా (చికిత్స పొందుతూ మరణించారు), సల్వా జుడుమ్ సృష్టికర్త, పార్టీ సీనియర్ నేత మహేంద్ర కర్మ, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముద్లియార్తో పాటు మొత్తం 29 మంది ప్రముఖ రాజకీయ నాయకులు, కార్యకర్తలు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
*సుదీర్ఘ దర్యాప్తు..
ఈ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటనపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వ్యక్తడవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేసింది. ఎన్ఐఏ అధికారులు సుదీర్ఘంగా దర్యాప్తు జరిపి పలుమార్లు చార్జ్షీట్లు దాఖలు చేశారు. ఈ ట్రయల్‌లో భాగంగా కోర్టు ఏకంగా 101 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. విచారణ ఎదుర్కొన్న 11 మంది నిందితులలో ఒకరు విచారణ సమయంలోనే అనారోగ్యంతో మరణించగా, మిగిలిన 10 మందికి నేరం రుజువు కావడంతో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
