Pick Nick First Look
Pick Nick First Look: ఆకేరు న్యూస్, సినిమా: భావన స్టూడియోస్ కొత్త సినిమాను ప్రకటించింది. సందీప్ ప్రదీప్, ఇంద్రజిత్ సుకుమారన్, దిలీష్ పోతన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పిక్ నిక్ అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఫ్యామిలీ కామెడీ డ్రామా
రచయిత కిరణ్ జోసీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ప్రేమలు, బెత్లహేమ్ కుటుంబ యూనిట్ చిత్రాలకు కో-రైటర్‌గా పనిచేశారు. హోల్సమ్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుజినా శ్రీధరన్, అక్షత అజిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నాలుగు భాషల్లో రిలీజ్
మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేయనున్నారు. 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో షోయింగ్ బిజినెస్ భాగస్వామిగా వ్యవహరించనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
