ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి బోనాల్లో భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత
* ఈసారి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి..
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ఈసారి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయని భవిష్యవాణి (Bhavishyavani) లో స్వర్ణలత (Swarnalatha) తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు (Secunderabad Ujjaini Mahankali Bonalu) ఘనంగా జరుగుతుండగా, రెండో రోజు తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. వడి బియ్యం, చీర సారెలతో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. పచ్చి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ‘నాకు సంతోషంగా ఉంది. నాకు కావాల్సిన పూజలన్నీ అందిస్తున్నారు. బాలికలు, యువతులు, మహిళలు ఇలా ఎవరు బోనం సమర్పించినా స్వీకరిస్తా. పంటలు బాగా పండుతాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కోరినన్ని వర్షాలు కురుస్తున్నాయి. నన్ను చూడాలంటే 48 గంటలు కష్టం అంటున్నారు. ఆమాత్రం కష్టపడలేరా?. ఏమి తెచ్చినా ఆనందంగా తీసుకుంటా. ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతా. ప్రజలను చల్లగా కాపాడుకుంటా. ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటా. నా రూపాన్ని పెట్టండి. నారూపాన్ని తప్పకుండా పెట్టించుకుంటా, నిలబెట్టుకుంటా. నా గ్రామ ప్రజలందరూ చల్లని సాగ పడుతున్నారు.. అంటూ స్వర్ణలత భవిష్యవాణిలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి, సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్చార్జి కోట నీలిమ, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం 7 గంటలకు ఫలహారం బండ్ల ఊరేగింపుతో బోనాల జాతర ముగియనుంది.
———————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
