Chiranjeevi
* జనవరి 13న విడుదల
Chiranjeevi| ఆకేరు న్యూస్, సినిమా: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న కాకా చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను జనవరి 13న విడుదల చేయనున్నట్లు చిరంజీవి స్పష్టం చేశారు. సిగ్మా మూవీ ముందస్తు ఈవెంట్లో పాల్గొన్న ఆయన అభిమానులను ఉద్దేశించి మనం వస్తున్నాం.. అంటూ చేసిన వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
విడుదలపై క్లారిటీ
సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ కాకా చిత్రబృందం పనులను వేగంగా పూర్తి చేస్తోంది. తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో సినిమా విడుదల తేదీపై స్పష్టత వచ్చినట్లైంది. దీంతో మెగా అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
డబ్బింగ్ పనులు పూర్తి
సినిమాకు సంబంధించి ఫస్ట్ హాఫ్ 50 శాతం, సెకండ్ హాఫ్ 30 శాతం డబ్బింగ్ పనులు పూర్తైనట్లు సమాచారం. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎం పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్‌ను మరోసారి తెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
