The Paradise
* రూ.100 కోట్ల క్లబ్లో నాని సినిమా
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సినిమాపై మిశ్రమ స్పందనలు వ్యక్తమైనప్పటికీ వసూళ్ల జోరు మాత్రం కొనసాగుతోంది.
చిత్ర నిర్మాతల వెల్లడించిన వివరాల ప్రకారం.. విడుదలైన రెండు రోజుల్లోనే ‘ది ప్యారడైజ్’ ప్రపంచవ్యాప్తంగా రూ.114 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. నాని కెరీర్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న చిత్రంగా నిలిచినట్లు మేకర్స్ తెలిపారు.
ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లు
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలు, హిందీ మార్కెట్లలోనూ ‘ది ప్యారడైజ్’కు స్పందన లభిస్తోంది. ఓవర్సీస్లోనూ సినిమా వసూళ్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఇప్పటికే 1.7 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది. త్వరలోనే 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకునే దిశగా సినిమా సాగుతోందని తెలిపింది.
మూడో రోజుపై ఆసక్తి
మూడో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బలంగా ఉన్నాయని మేకర్స్ చెబుతున్నారు. దీంతో వీకెండ్లో ‘ది ప్యారడైజ్’ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని చిత్రబృందం పేర్కొంది. తొలి వీకెండ్ పూర్తయ్యే సరికి సినిమా మరిన్ని భారీ నంబర్లను నమోదు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. నాని సరసన నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై ప్రస్తుతం బాక్సాఫీస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది
Please tell us what is wrong. Your report will be sent to the website team.
