Kaka
ఆకేరు న్యూస్,సినిమా: మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’ డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘కాకా’ టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులను ప్రారంభించింది.
* శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు
షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా చిత్ర బృందం వేగంగా పూర్తి చేస్తోంది. ‘ది బ్లడీ బెంచ్‌మార్క్’ సెట్ చేసేందుకు టీమ్ ఫుల్ స్పీడ్‌లో పనిచేస్తోంది. ఈ చిత్రంలో అనశ్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
* భారీ సాంకేతిక బృందం
కోన వెంకట్, కే. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అడిషనల్ స్క్రీన్‌ప్లే రైటర్స్‌గా వ్యవహరిస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు. వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా యుగంధర్ టి, ముఖ్య కో-డైరెక్టర్లుగా బెల్లంకొండ సత్యం, పూసల రాధాకృష్ణ, కో-డైరెక్టర్‌గా వి. క్రాంతి చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా శరణ్య పోట్ల వ్యవహరిస్తున్నారు.
* సంక్రాంతికి ‘కాకా’
మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్ తదితరులు నటిస్తున్న ‘కాకా’ 2027 జనవరి 13న సంక్రాంతి సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
