Ajay Devgn, Shah Rukh Khan, and Tiger Shroff
* FDA నోటీసులకు హీరోల రిప్లై
ఆకేరు న్యూస్, సినిమా: విమల్ ఏలకుల యాడ్ వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌కు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) జారీ చేసిన నోటీసులపై ముగ్గురూ స్పందించారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే వెల్లడించారు. వీరిలో ఇద్దరు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని కోరగా.. మంగళవారం వారి విచారణ కూడా పూర్తయినట్లు తెలిపారు.
పాన్ మసాలా ప్రచారంపై అభ్యంతరం
విమల్ ఏలకుల ప్రకటన ద్వారా నిషేధిత విమల్ పాన్ మసాలాకు పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో FDA ఈ నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్రలో పాన్ మసాలా నిషేధంలో ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటనపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముగ్గురు నటుల నుంచి సమాధానాలు అందాయని, ఇద్దరి వ్యక్తిగత విచారణ కూడా పూర్తయిందని తుకారాం ముండే తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
