వయనాడ్ బాధితులకు రూ. 2 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించిన నటుడు ప్రభాస్
* వయనాడ్ బాధితులకు బారీ విరాళం
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ఆపదలో ఉన్న కేరళను అదుకోవడానికి మనసున్న మారాజులు ముందుకొస్తున్నారు. పలు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు విరాళాలు సేకరించి పంపుతున్నాయి. కాగా, తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు ఇప్పటికే విరాళాలు ప్రకటించారు. తాజాగా హీరో ప్రభాస్ సాయంలోనూ తన గొప్ప మనసును చాటుకున్నారు. వయనాడ్ భాదితులను చూసి చలించిపోయిన ప్రభాస్ గాయపడిన భాదితుల చికిత్స సహాయార్ధం భారీగా ఆర్థిక సాయం అందించారు. ఇప్పటి వరకు అందరు హీరోలు అందించిన దాని కంటే ఎక్కువగా ఏకంగా రూ. 2 కోట్లు అందించారు. ప్రభాస్ కు కేరళలో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. తన సినిమాలను ఆదరించే అభిమానులు కష్టాల్లో ఉండడంతో ప్రభాస్ గొప్ప మనసు చాటుకున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ తో మరికొందరు సినీ తారలు సైతం వయనాడ్ భాదితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇందులో భాగంగానే సూర్య, జ్యోతిక, కార్తీ కలిపి రూ. 50లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షలు అందించారు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ. 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిపి కోటి రూపాయల ఆర్థిక సాయం చేశారు.
—————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
