* వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు
* 100 గ్రామాలు బరువు ఎక్కువ ఉందని చర్యలు
ఆకేరు న్యూస్ స్పోర్ట్స్ డెస్క్ : ఒలింపిక్స్ లో రెజ్లర్ వినేష్ ఫోగట్ స్వర్ణానికి చేరువు అవుతుందని ఆశిస్తున్న భారత అభిమానులకు షాక్ తగిలింది. ఓవర్ వెయిట్ కారణంగా వినేష్‌పై అనర్హత వేటు వేశారు. 50 కేజీల రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్ కు దూసుకెళ్లిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్.. 100 గ్రాములు అధిక బరువు ఉన్నందున ఆమెపై అనర్హత వేటు వేశారు. నిబంధనల ప్రకారం ఏ కేటగిరీలోనైనా రెజ్లర్‌కు 100 గ్రాముల అదనపు బరువు వరకు మాత్రమే సడలింపు ఉంటుంది. కానీ వినేష్ బరువు దీని కంటే ఎక్కువగా ఉంది. దీంతో ఆమెకు రజత పతకం కూడా లభిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. వాస్తవానికి భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పతకానికి అడుగుదూరంలోఉన్నారు. డిపెండింగ్ చాంపియన్ యువీ సుసాకిని మట్టికరిపించి.. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు. ప్రపంచ నంబర్ వన్ ఉక్రెయిన్ క్రీడాకారిణి ఒక్సానా లివాచ్‌ను క్వార్టర్స్‌లో 7-5తో ఓడించి సెమీఫైనల్స్‌కు చేరారు. సెమీఫైనల్స్‌లో గెలిస్తే స్వర్ణ లేదా రజత పతకాలను గెలుచుకునే అవకాశం ఉందని అందరూ భావించారు. ఇంతలో అనర్హత వేటు పడడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.
———————————–