Jantar Mantar Protest
* సీజేపీ నేతల ముందస్తు అరెస్ట్
* అజ్ఞాతంలోకి తరలింపు?
* కొనసాగుతున్న అరెస్టుల పర్వం
Jantar Mantar Protest| ఆకేరు న్యూస్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కార్యక్రమాల నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జంతర్‌మంతర్ వేదికగా ఆందోళనకు సిద్ధమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు కీలక నేతలు సౌరభ్ దాస్, అశుతోష్ రంకాలను ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విమానం దిగిన వెంటనే పోలీసులు ఫ్లైట్‌లోకి ప్రవేశించి వారిని అదుపులోకి తీసుకున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
భారీగా అరెస్టులు
సీజేపీ నేతల అరెస్టుల పర్వంతో ఢిల్లీ పోలీసులు మరింత దూకుడు పెంచారు. జంతర్‌మంతర్ వైపు తరలివస్తున్న ఆందోళనకారులు, పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుని పెద్ద ఎత్తున ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 200 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నగర సరిహద్దుల్లోనూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ, నిరసనకారులను ఎంట్రీ పాయింట్ల వద్దే కట్టడి చేసేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
భద్రతా నిఘా నీడలో ఢిల్లీ
నిరసనల తీవ్రత దృష్ట్యా ఢిల్లీ పోలీసులు అత్యంత అప్రమత్తమయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలకు వ్యతిరేకంగా, అలాగే ఎన్నికల జాబితాల రూపకల్పన వంటి అంశాలను నిరసిస్తూ తలపెట్టిన ఈ ఆందోళనలను కట్టడి చేయడానికి భారీగా బలగాలను మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మెట్రో స్టేషన్లపై నిఘా, డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతున్నాయి. ప్రధాన నేతల అజ్ఞాతవాసం, వరుస అరెస్టుల నేపథ్యంలో ఢిల్లీలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోననే ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

