పెరుమాండ్ల రామకృష్ణ
* డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ నివాళి
ఆకేరు న్యూస్, వరంగల్: సీపీఐ సీనియర్ నాయకులు మేకల రవి ఆకస్మిక మృతి ప్రజా ఉద్యమాలకు, శ్రామిక లోకానికి తీరని లోటని పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం పోరాడిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
భౌతికకాయానికి నివాళి
శనివారం వరంగల్లో మేకల రవి భౌతికకాయాన్ని సందర్శించిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆశయాలే నిజమైన నివాళి
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. నిరుపేదల పక్షాన నిలబడి మేకల రవి చేసిన పోరాటాలు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. కష్టకాలంలోనూ తన సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి అని కొనియాడారు. మేకల రవి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
పలువురి సంతాపం
ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ మాదాసి సురేష్తో పాటు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేకల రవికి కన్నీటి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

