టబు
* 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు కాంబినేషన్
* డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల
Tabu| ఆకేరు న్యూస్, సినిమా: అక్కినేని నాగార్జున తన సినీ కెరీర్లో ప్రతిష్ఠాత్మకమైన 100వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘కింగ్ 100’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా నటి టబు పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది.
ఈ సినిమాలో టబు ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. గ్లింప్స్‌లో ఆమె పవర్ఫుల్ వాయిస్‌ఓవర్‌తో పాత్ర స్వభావాన్ని పరిచయం చేశారు. ‘‘ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. లక్‌ను నమ్మేవాళ్లు ఒకరు, హార్డ్ వర్క్‌ను నమ్మేవాళ్లు మరొకరు. ఐ హేట్ లక్’’ అనే డైలాగ్‌తో ఆమె పాత్రలోని ఆత్మవిశ్వాసం, తెగువను చూపించారు.
భారీ జనసమూహం మధ్య టబు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం, ప్రజలకు అభివాదం చేస్తూ పదవీ ప్రమాణ స్వీకారం చేయడం గ్లింప్స్‌లో ఆకట్టుకుంటున్నాయి. హుందాతనం, అధికార దర్పం, రాజసం కలగలిసిన పాత్రలో టబు కనిపించనుండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.
28 ఏళ్ల తర్వాత జోడీ
నాగార్జున, టబు దాదాపు 28 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి జోడీ ప్రేక్షకులను అలరించగా, ఇప్పుడు ‘కింగ్ 100’లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యుద్ధం, అధికార పోరాటం నేపథ్యంలో సాగే కథలో టబు పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తాజా గ్లింప్స్ సూచిస్తోంది. ఇప్పటికే విడుదలైన నాగార్జున గ్లింప్స్‌కు మంచి స్పందన రాగా, తాజాగా టబు పాత్ర పరిచయ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
భారీ సాంకేతిక హంగులు
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ రాజా మహదేవన్ విజువల్స్ అందిస్తుండగా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, సతీష్ కుమార్ ఎన్ ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు.
రా కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కింగ్ 100’ చిత్రాన్ని డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

