

* సోదరుడు, కుమారుడిపై కూడా..
* కౌశిక్‌రెడ్డి ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లో బీఆర్ ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాదోపవాదాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ(Arekapudi Gandhi), పాడి కౌశిక్ రెడ్డి(Padi kousikreddy) మధ్య వార్‌పై మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. గాంధీ ఇంటి వద్ద బందోబస్తు కొనసాగుతూనే ఉంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(Kiachannagari laxmareddy) మాట్లాడుతూ అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నాయకులకు పిచ్చి పట్టిందని విమర్శించారు. కాగా, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకలపూడి గాంధీపై (Arekapudi Gandhi) హత్యాయత్నం కేసు నమోదైంది. గాంధీ సోదరుడు, కుమారుడు పృథ్వీతోపాటు కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీకాంత్‌ను నిందితులుగా పేర్కొంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 12న హైదరాబాద్‌లో జరిగిన పొలిటికల్ హైటెన్షన్ తెలిసిందే. అలాగే కౌశిక్‌రెడ్డి, అతడి అనుచరులపై కూడా కేసులు నమోదయ్యాయి.అలాగే కౌశిక్‌రెడ్డి, అతడి అనుచరులపై కూడా కేసులు నమోదయ్యాయి.అలాగే కౌశిక్‌రెడ్డి, అతడి అనుచరులపై కూడా కేసులు నమోదయ్యాయి.
——————————————————————————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
